కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మహబూబాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ ర్యాలీలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు.
అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన వ్యవసాయ బిల్లులు కార్పొరేట్ రంగానికి వరంగా... రైతుల పాలిట శాపంగా మారిందని బలరాం నాయక్ మండిపడ్డారు. హథ్రస్ ఘటన బాధిత కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న రాహుల్ గాంధీపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు.