మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో ఈ నెల 24 నుంచి పట్టణ ప్రగతి కార్యక్రమం ఉన్నందున ప్రతి వార్డుకు కమిటీలు వేయనున్నారు. మున్సిపాలిటీలోని సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికై ప్రభుత్వ ఆదేశాల మేరకు వార్డు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తొర్రూరు మున్సిపల్ కమిషనర్ గుండె బాబు తెలిపారు. కమిటీకి 15 మంది చొప్పున నాలుగు కమిటీల్లో మొత్తం 60 మంది సభ్యులుండేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
ఇవీ చూడండి: సర్వం శివమయం.. శివాలయాల్లో భక్తజన సందోహం..