మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ధర్నా నిర్వహించారు. హైదరాబాద్లో ఆర్టీసీ కార్మికులపై లాఠీఛార్జ్ చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. అదే సమయంలో అటువైపు వెళ్తున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ వాహనాన్ని అడ్డగించి నినాదాలు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మార్చుకుని కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: మిలియన్ మార్చ్ విజయవంతం: బండి సంజయ్