వలస కూలీలందరికి తప్పనిసరిగా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సత్యవతి రాఠోడ్ స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ గౌతమ్, ఎస్పీ కోటిరెడ్డి, ఇతర అధికారులతో కలిసి కరోనా వైరస్ వల్ల జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై మంత్రి సమీక్షించారు. మహబూబాబాద్ జిల్లా గ్రీన్ జోన్ గా ప్రకటించిన నేపథ్యంలో కరోనా పట్ల నిర్లక్ష్యం వహించవద్దని, బయటకు వచ్చే ప్రతి ఒక్కరు అన్ని జాగ్రత్తలు తీసుకునేటట్లు చూడాలన్నారు. జనాలు గుంపులుగా ఉండకుండా, భౌతిక దూరం పాటించేలా పర్యవేక్షించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
రైతు పండించిన పంటలో ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఆందోళన చెందవద్దని మంత్రి పేర్కొన్నారు. రాజకీయాలు చేసే వారి ఉచ్చులో పడవద్దని రైతులకు హితవు పలికారు. ఈ సంవత్సరం వానాకాలం పంటలలో ప్రభుత్వం సూచించిన లాభదాయకమైన పంటలు వేయాలని రైతులను కోేరారు.
ఇదీ చూడండి: ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్ష ఎలా సాధ్యం?