మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకునేందుకు ఆయన బయల్దేరి వెళ్లారు. కాగా ఈ విషయాన్ని ఎమ్మెల్యేనే స్వయంగా ఓప్రకటన ద్వారా ప్రజలకు చెప్పారు. తనను గత రెండు రోజుల్లో కలిసిన వారు అందరూ టెస్టులు చేయించుకోవాలని సూచించారు.
ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి క్షేమంగానే ఉందని.. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు. ప్రజలకు పార్టీ శ్రేణులకు ఏ అవసరం వచ్చినా.. ఏసమయంలోనైనా తనను ఫోన్ ద్వారా సంప్రదించాలని తెలిపారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో రెండున్నర లక్షలకు చేరిన కరోనా కేసులు