ETV Bharat / state

కరోనా రోగి హైదరాబాద్​లో మిస్సింగ్... తొర్రూరు బస్సులో ప్రత్యక్షం - కరోనా రోగి హైదరాబాద్​లో మిస్సింగ్... తొర్రూరు బస్టాండ్‌లో ప్రత్యక్షం

corona patient midding in hyderabad found in torrur bus
కరోనా రోగి హైదరాబాద్​లో మిస్సింగ్... తొర్రూరు బస్సులో ప్రత్యక్షం
author img

By

Published : Jun 17, 2020, 11:28 AM IST

Updated : Jun 17, 2020, 12:28 PM IST

10:25 June 17

కరోనా రోగి హైదరాబాద్​లో మిస్సింగ్... తొర్రూరు బస్సులో ప్రత్యక్షం

హైదరాబాద్​ కింగ్​ కోఠి ఆసుపత్రిలో కరోనా రోగి తప్పించుకున్నాడు. మహబూబాబాద్​ జిల్లా తొర్రూరులో ప్రత్యక్షమయ్యాడు. అతని తమ్ముడి ద్వారా పోలీసులు సమాచారం తెలుసుకోగా వరంగల్​ జిల్లా వర్ధన్నపేట పోలీస్​స్టేషన్​ పరిధిలో బస్సును నిలిపివేశారు.

వరంగల్​ జిల్లా రాయపర్తి మండలం కొండాపురం గ్రామానికి చెందిన పున్నం వెంకన్నకు కరోనా పాజిటివ్​ రాగా అతను హైదరాబాద్​లోని కింగ్​ కోఠి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అతను ఆసుపత్రి నుంచి తప్పించుకుని ఎల్​బీ నగర్​ వద్ద సూర్యాపేట బస్సు ఎక్కాడు.  

అక్కడి నుంచి తొర్రూరు వెళ్లేందుకు బస్సు ఎక్కాడు. అతని తమ్ముడి ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు వర్ధన్నపేట పీఎస్​ పరిధిలో ఆర్టీసీ బస్సును నిలిపివేశారు. అధికారుల చేత వాహనాన్ని పూర్తిగా శానిటైజ్​ చేయించారు. 

Last Updated : Jun 17, 2020, 12:28 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.