మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ గౌతమ్, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డిలు లాక్డౌన్ అమలు తీరును పరిశీలించారు. పట్టణంలో ఉదయం 10 గంటల తరువాత లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. లాక్డౌన్ సడలింపు సమయం దాటాక రహదారుల పైకి వచ్చే వాహనదారుల అనుమతులను పరిశీలిస్తున్నారు. అనుమతి లేకుండా వచ్చే వారి వాహనాలను సీజ్ చేస్తూ... జరిమానాలు విధిస్తున్నారు.
జమాండ్లపల్లి చెక్పోస్ట్ వద్ద జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి స్వయంగా వచ్చి... వాహన తనిఖీలు చేశారు. రహదారులపైకి వచ్చే వారిని ఆపి... ఎందుకు వస్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, అనుమతులు ఉన్నాయా, లేవా అని అడిగి తెలుసుకుంటున్నారు. అత్యవసర సమయాల్లో తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దని.. ఒకవేళ వచ్చినా మాస్కు ధరించి, భౌతిక దూపం పాటించాలని సూచించారు.
ఇదీ చదవండి : Lockdown Effect: ఆర్థిక సుడిగుండంలో కూరగాయల రైతు