అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని మహబూబూబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. డోర్నకల్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఎస్పీ స్వయంగా రక్తదానం చేసి అందరిలో స్ఫూర్తి నింపారు. ప్రతి ఒక్కరు రక్తదానం చేసినట్లయితే ఆపదలో ఉన్నవారికి ప్రాణదానం చేసినవారవుతారని సూచించారు. రక్తదాన కార్యక్రమాల్లో యువత ముందంజలో ఉండాలని తెలిపారు.
ఇదీ చదవండిః కొల్లాపూర్లో పోలీసుల రక్తదాన శిబిరం