ETV Bharat / state

రైతు శ్రేయస్సుకే నియంత్రిత సాగు విధానం - రైతులు పంటలను సాగు చేసి లాభాలు పొందాలని మంత్రి సత్యవతి రాఠోడ్

నియంత్రిత సాగు విధానాన్ని తప్పక పాటించాల్సిందేనని మంత్రి సత్యవతి రాఠోడ్ స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గౌరారంలో నియంత్రిత సాగు విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ వానాకాలం నుంచి మొక్కజొన్న పంటను వేయకూడదని.. పత్తి, కంది పంటలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినందున వాటినే సాగు చేయాలని సూచించారు.

Farmers should cultivate crops and get profits
రైతు శ్రేయస్సుకే నియంత్రిత సాగు విధానం
author img

By

Published : May 28, 2020, 11:14 AM IST

రైతులను బాగు చేయాలనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంత్రిత సాగు విధానం ప్రవేశ పెట్టారని మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గౌరారంలో నియంత్రిత సాగు విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రభుత్వ, వ్యవసాయాధికారుల ఆలోచన విధానాలకు అనుగుణంగా రైతులు పంటలను సాగు చేసి లాభాలు పొందాలని మంత్రి కోరారు. రైతులంతా వానాకాలం మక్కలను వేయవద్దని, దొడ్డు వరిధాన్యానికి బదులుగా సన్న వరి ధాన్యం పండించాలని సూచించారు.

రైతులందరికీ రుణ మాఫీ..

లాక్ డౌన్ కారణంగా రైతులు ఇబ్బంది పడకూడదని.. సీఎం కేసీఆర్ మద్దతు ధరతో వరి, మక్కలను కొనుగోలు చేసినట్లు మంత్రి సత్యవతి స్పష్టం చేశారు. రూ. 1200ల కోట్లతో 25 వేల లోపు రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణ మాఫీ జరిగిందని పేర్కొన్నారు. రైతులు పెట్టుబడికి ఇబ్బంది పడకుండా ప్రతి ఎకరాకు రూ. 10 వేలు ఇస్తున్నారని తెలిపారు. బయ్యారం పెద్ద చెరువు, తులారం ప్రాజెక్టులను రిజర్వాయర్ లు గా మార్చి.. సీతారామ ప్రాజెక్టు ద్వారా నీరు అందిస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: మండుతున్న ఎండలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.