రాష్ట్రంలో కరోనాతో అట్టడుగు వర్గాల ప్రజలు... నిరుద్యోగ సమస్యతో యువత ఇబ్బందులు పడుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి మధుయాస్కిగౌడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈఓ, అర్చకులు మేళ తాళాలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాష్ట్రంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ స్వామి వారిని కోరుకున్నానని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలో ఫీజుల కోసం ఇబ్బంది పెడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల్లో రాయితీలు ఇవ్వడం లేదని విమర్శించారు. మోదీ ప్రభుత్వం నూతన రైతు చట్టాలను తీసుకొచ్చి.... రైతుల నడ్డి విరుస్తుందని ఆరోపించారు. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలగాలన్నారు.
ఇదీ చూడండి: 'సాగర్ పర్యటనకు ముందే గిరిజనులకు సీఎం హామీ ఇవ్వాలి'