కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తోందని కాగజ్నగర్ ఎఫ్డీఓ విజయ్ కుమార్ తెలిపారు. అటవీ ప్రాంతం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్థానికుల సమాచారంతో చింతలమనేపల్లి అటవీ ప్రాంతంలో పులి అడుగులను విజయ్ కుమార్ పరిశీలించారు.
మండలంలోని గూడెం, శివపెళ్లి, కోయపల్లి, నాగేపల్లి గ్రామాల ప్రజలు అడవిలోకి, సమీపంలోని వ్యవసాయ భూముల్లోకి వెళ్లకూడదని అన్నారు. ఒకవేళ అత్యవసరమై వెళ్తే... గుంపులుగా వెళ్లి పనులు చేసుకోవాలని... సాయంత్రంలోపే ఇంటికి చేరుకోవాలని సూచించారు. అటవీశాఖ సిబ్బంది పులి కదలికలపై అప్రమత్తంగా ఉండాలని ఎఫ్డీఓ విజయ్ కుమార్ ఆదేశించారు.
ఇదీ చదవండి: కంటతడి పెట్టిస్తున్న కానిస్టేబుల్ వీడియో