ఆర్టీసీ కార్మికుల సమ్మె కాలంలో మరణించిన వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన కండక్టర్ ఏరుకొండ రవీందర్ కుటుంబసభ్యులు ఈ రోజు స్ధానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని కలిశారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందంటూ ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబం రోడ్డున పడకుండా కాపాడిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ధన్యవాదాలు చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సమ్మె కాలంలో మృతిచెందిన ఉద్యోగస్తుల కుటుంబాలను కేసీఆర్ అక్కునచేర్చుకొని అండగా నిలిచారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఆర్టీసీ సమ్మె సమయంలో మృతి చెందిన ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన రాజమౌళి కూతురు ప్రియాంకకు కూడా జూనియర్ అసిస్టెంట్‌గా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే వెల్లడించారు. త్వరలోనే రెండు పడక గదుల ఇల్లు కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: సమత కేసులో ఛార్జిషీట్.. సోమవారం నుంచి విచారణ..