కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కురిసిన వడగండ్ల వర్షానికి మామిడి పంట తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఉద్యాన అధికారులు తెలిపారు. రెబ్బెనలో 210 ఎకరాలు... సిర్పూర్ టీ కాగజ్నగర్ మండలాలలో 55 ఎకరాల్లో మామిడి పంట నేల రాలి రైతులకు భారీ నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. బలమైన గాలులు, వడగండ్లకు 70 శాతం పంట దెబ్బతిందని తెలిపారు. పంట నష్టం విలువ రూ. 67 లక్షలు ఉంటుందని వెల్లడించారు. పరిహారం కోసం నివేదికను ప్రభుత్వానికి పంపినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: ప్రపంచంపై 'కరోనా' కరాళ నృత్యం.. 2 లక్షలు దాటిన మృతులు