ఆసిఫాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 21, 24, 28, 30 తేదీల్లో జరగాల్సిన సదరం శిబిరాలు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వెంకట శైలేష్ తెలిపారు. లాక్డౌన్ కొనసాగుతున్న దృష్ట్యా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లా పాలనాధికారి ఆదేశాలతో రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మీ-సేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకున్న దివ్యాంగులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. సదరం శిబిరాలు రద్దు కావటం వల్ల ఎవ్వరూ.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి రాకూడదని పేర్కొన్నారు.