బీఆర్ అంబేడ్కర్ రాజగృహంపై దాడి చేసిన దుండగులపై దేశద్రోహం కేసు నమోదు చేయాలంటూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిరసన, మహా దీక్ష చేపట్టారు. భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ గృహంపై దాడి చేసి ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
గృహంపై దాడి చేసిన వారు ఇద్దరే అయినా.. వారి వెనుక ఉన్నవారిని గుర్తించాలంటే సీబీఐ చేత విచారణ జరపాలని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయమై వెంటనే స్పందించి అంబేడ్కర్ వారసులకు పూర్తి రక్షణ కల్పించాలని లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: భారత్కు రఫేల్- వాయుసేనకు కొత్త శక్తి