ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 69 వ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గ ఇంఛార్జీ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ తెలిపారు. సెప్టెంబర్ 14 నుంచి వారం రోజుల పాటు 'సేవా సప్తహ్' కార్యక్రమం జరుపనున్నట్లు వివరించారు. అనారోగ్యంతో బాధపడుతున్న స్థానిక మహిళకు శ్రీనివాస్ ఆర్థిక సహాయం అందించారు.
ఇదీ చూడండి: శునకాల పెళ్లికి ఊళ్లో పెద్దల హడావుడి!