కుమురం భీం జిల్లా కాగజ్నగర్ పురపాలికలో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 11 గంటల వరకు 29.17 శాతం పోలింగ్ నమోదైంది. 9 గంటల వరకు మందకొడిగా సాగిన పోలింగ్... 10 గంటల తర్వాత పుంజుకుంది.
ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. 11వ నంబరు వార్డులోని సుప్రబాత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు బాట సరిగా లేకపోవడం వల్ల ఓటర్లు ఇబ్బంది పడ్డారు.
పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు మెట్లు సైతం లేకపోవడం వల్ల వృద్ధులు, దివ్యంగులు ఇబ్బందులు పడ్డారు. బరిలో నిలుచున్న పలువురు అభ్యర్థులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
- ఇవీ చూడండి: హలో ఓటర్.. ఓటేస్తూ సెల్ఫీలు వద్దు!