ETV Bharat / state

చరిత్రే చిన్నబోతోంది... ఆ రణభూమికి ఇప్పుడేమైంది!? - komaram bheem museum

అదో రణక్షేత్రం... నిజాం సాయుధ బలగాలనే నిలువరించిన పోరుగడ్డ. ఆదివాసీల స్వయం ప్రతిపత్తే ధ్యేయంగా ఘీంకరించిన ఉద్యమ బావుట. ఆ రణభూమే... జోడేఘాట్‌. కుమురం భీం అసువులు బాసి... ఏడు దశాబ్దాలు గడిచినా... జోడేఘాట్‌లో నేటికీ... కనీస సౌకర్యాలు అందుబాటులోకి రాలేదు. చరిత్రకు సాక్షిభూతంగా నిలిచే జోడేఘాట్‌ ధైన్యంపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

komaram bheem
author img

By

Published : Oct 17, 2019, 11:16 PM IST

Updated : Oct 18, 2019, 7:46 AM IST

నిరాదరణకు గురవుతున్న పోరుగడ్డ

జల్‌... జంగల్‌... జమీన్‌... నినాదాలతో నిద్రాణమై ఉన్న ఆదివాసుల్లో చైతన్య బావుట ఎగురవేసిన... కుమురం భీం పోరాటానికి ఊపిరిలూదిన రణక్షేత్రమే జోడేఘాట్‌. పరిసరాల్లోని 12 ఆదివాసీ గ్రామాలన్నీ దట్టమైన అడవులతో కూడి... ఎత్తైన కొండల మద్య... శత్రుదుర్భేద్యంగా ఉండడంతో పాటు... భీం పోరాటానికి కలిసి వచ్చింది. రణక్షేత్రంగా నిలిచింది. కానీ... కోవర్టు సమాచారంతో జోడేఘాట్‌ గుహల్లో నిద్రిస్తున్న స్థావరంపై 1940లో అశ్వయుజ పౌర్ణమి రోజున నిజాం సైన్యం జరిపిన కాల్పుల్లో భీం అసువులు బాశారు. అప్పటి నుంచి భీం పోరాట పటిమ ప్రాచుర్యం పొందినట్లే... జోడేఘాట్‌ ఖ్యాతీ పెరుగుతూనే వస్తోంది. కానీ అక్కడ ప్రభుత్వం రూ.25 కోట్లతో నిర్మించిన మ్యూజియం తప్ప... ఆదివాసీ ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు కనిపించడంలేదు.

దాదాపుగా 500లోపు జనాభా కలిగిన జోడేఘాట్‌ గూడెం కనీస మౌలిక వసతులు నోచుకోవడంలేదు. అక్కడి ప్రజల బతుకుల్లో ప్రగతి కనిపించడంలేదు. వ్యవసాయమే ఆధారంగా జీవిస్తోన్న జోడేఘాట్‌లోని ఆదివాసీలకు ఒక్కరికీ పక్కా ఇళ్లులేదు. అడవిలో లభించే వెదురుకర్రతో నిర్మించుకున్న ఇళ్లే వారికి ఆధారం. గతంలో కొంతమందికి మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కూడా అర్ధంతరంగానే మిగిలింది. తాగేందుకు కనీసం రక్షిత మంచినీరు అందుబాటులో లేదు. గ్రామంలో ఉన్న ఒక్క బావి ద్వారా సరఫరా అయ్యే నీరు దాహాం తీరుస్తోంది. అదీ పనిచేయకుంటే నీటి కోసం మైళ్ల దూరం వెళ్లాల్సిందే. మిషన్‌ భగీరథ జాడే లేదు. కుమురం భీం అసువులు బాసి ఏడు దశాబ్దాలు గడిచినా జోడెఘాట్‌కు బస్సు సౌకర్యం లేదు.

ఏటా భీం వర్ధంతి రోజున నివాళులర్పించడానికి వచ్చే ప్రజాప్రతినిధులు, అధికారులు.. ఇచ్చే హామీలేవీ ఆ తరువాత ఆచరణకు నోచుకోవడంలేదు. ఫలితంగా అక్కడ ప్రగతి కనిపించడం లేదు. జోడేఘాట్‌లో మురికికాలువల నిర్మాణం లేక వ్యాధులు ప్రభలడానికి కారణమవుతోంది. విద్యుత్‌ స్తంభాలు, విద్యుత్‌ తీగలకూ నోచుకోవడంలేదు. ప్రతిఒక్కరిని రక్తహీనత పట్టి పీడిస్తోంది. అనారోగ్యానికి సర్కారు వైద్యం అందుబాటులో లేదు. కుమురం భీం పేరు చెప్పడమే తప్పా... తమ బతుకులు చీకట్లోనే మగ్గుతున్నాయనే ఆవేదన అక్కడి ఆదివాసుల్లో వ్యక్తమవుతోంది.

తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక తొలిసారిగా 2015లో వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌... అక్కడి పరిస్థితులను చూసి చలించిపోయారు. వంద ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచమే అబ్బురపడేలా జోడేఘాట్‌ను అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రూ.25 కోట్ల వ్యయంతో చేపట్టిన భీం మ్యూజియం తప్పా... ప్రస్తుతం ఇంకా ఎలాంటి మార్పు లేదు. కనీసం బస్సు సౌకర్యం లేనందున జోడేఘాట్‌ నుంచి 22 కి.మీ దూరంలో ఉన్న కెరమెరికి కాలినడకనో, ఎడ్లబండిపైనో... వస్తేనే తప్పా.... ఆదివాసీలకు బాహ్య ప్రపంచం అంటే ఏమిటో తెలియకుండాపోతోంది.

ఇదీ చూడండి: ఆదివాసీల నృత్యం.. తెచ్చింది పరవశం..

sample description
Last Updated : Oct 18, 2019, 7:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.