ETV Bharat / state

15 ఆక్సిజన్​ సిలిండర్లను అందజేసిన ఎమ్మెల్యే కోనేరుకోనప్ప - తెలంగాణ న్యూస్ అప్​డేట్స్

కొవిడ్​ మహమ్మారితో పోరాడుతున్న వారికి తనవంతు సాయం చేసి ఆదర్శంగా నిలిచారు కుమురం భీం జిల్లా సిర్పూర్​ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. ఒకవైపు కాగజ్​నగర్​లో చికిత్స పొందుతున్న కొవిడ్​ రోగులకు భోజన సదుపాయం కల్పిస్తూనే.. ప్రాణవాయువుని సైతం అందిస్తున్నారు.

koneru konappa
koneru konappa
author img

By

Published : May 18, 2021, 4:14 PM IST

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​ పట్టణంలో కోనేరు చారిటబుల్​ ట్రస్ట్​ ఆధ్వర్యంలో 15 ఆక్సిజన్​ సిలిండర్లను ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అందజేశారు. కాగజ్​నగర్​ ఆర్డీవో ఆధ్వర్యంలో అవసరం ఉన్న కొవిడ్​ రోగులకు అందజేయాలని సూచించారు. కొవిడ్​తో పోరాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి ప్రాణవాయువు అందక ఇబ్బంది పడుతున్నారని.. అటువంటి వారికి ఆక్సిజన్​ అందించాలని కోరారు.

కొవిడ్ సోకిన వారు ఆత్మస్థైర్యం కోల్పోకుండా సరైన చికిత్స తీసుకుంటే సులభంగా కొలుకోవచ్చని అన్నారు. కొవిడ్​ చికిత్స పొందుతున్నవారు ఏ అవసరం వచ్చిన తనను సంప్రదించాలని తెలిపారు.

ఇదీ చూడండి: మరోసారి పరస్పర విమర్శలకు దిగిన ఈటల, గంగుల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.