పేద విద్యార్థులకు చదువుల్లో చేయుతనివ్వాలనే సంకల్పంతో చేతన ఫౌండేషన్ ల్యాప్‌టాప్‌లు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో కలెక్టర్ రాహుల్ రాజ్‌తో కలిసి ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా చేతన ఫౌండేషన్ సేవలందిస్తోంది. తమ నియోజకవర్గంలో సహాయ కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరం. పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించడం అభినందనీయం.
-కోనేరు కోనప్ప, ఎమ్మెల్యే
ఎమ్మెల్యే సేవలు..
జిల్లా వెనుకబడి ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుల్లో ముందున్నారని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఎమ్మెల్యే తన సొంత నిధులతో సేవా కార్యక్రమాలు చేపట్టడమేకాకుండా.. స్వచ్ఛంద సంస్థల ద్వారా పేదలకు సాయం చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్మన్ కోనేరు కృష్ణారావు, చేతన ఫౌండేషన్ సభ్యులు ముత్తినేని సురేష్, వెంకటేశ్వర్లు, రషీద్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'సన్నబియ్యం పంపిణీ పేరిట తప్పుడు ప్రచారం చేస్తున్నారు'