సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని సిర్పూర్ కాగజ్‌నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పేర్కొన్నారు. క్రిస్మస్ను పురస్కరించుకొని పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కుమురం భీం అదనపు కలెక్టర్ డా. రాంబాబుతో కలసి హాజరయ్యారు. గాంధీనగర్‌లోని నజరతే చర్చ్‌లో క్రైస్తవ సోదరులకు ప్రభుత్వం తరఫున పండుగ కానుకలను పంపిణీ చేశారు.
పండుగలను అన్ని వర్గాల వారు సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ దసరా, రంజాన్, క్రిస్మస్లకు కానుకలను అందిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అన్ని మతాల వారు కలిసికట్టుగా ఉన్నప్పుడే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమానికి పురపాలక ఛైర్మన్ సద్దాం హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: సంక్షేమ పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శం: మంత్రి మల్లారెడ్డి