ETV Bharat / state

భోజన బిల్లుల కోసం కలెక్టర్ కార్యాలయం ముందు దీక్ష - భోజన బిల్లులు చెల్లించాలంటూ ఆందోళన

కరోనా కష్టకాలంలో రోగులకు భోజనాలు అందించిన హోటల్ యజమాని రోడ్డున పడ్డాడు. తనకు రావాల్సిన బిల్లుల కోసం కలెక్టర్ కార్యాలయం ముందు నిరాహరదీక్షకు దిగాడు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ సంఘటన కుమురంభీం అసిఫాబాద్​ జిల్లాలో జరిగింది.

dharna-at-kumuram-bheem-asifabad-dist-collector-office-to-pay-bills-supply-meals-to-covid-patients
భోజన బిల్లుల కోసం కలెక్టర్ కార్యాలయం ముందు దీక్ష
author img

By

Published : Jan 4, 2021, 6:04 PM IST

కుమురంభీం అసిఫాబాద్​ జిల్లా కేంద్రంలో భోజన బిల్లుల కోసం హోటల్​ యజమాని నిరాహరదీక్ష చేపట్టారు. కరోనాకాలంలో బాధితులకు ఏర్పాటు చేసిన రెండు నెలల బిల్లులు చెల్లించలేదని జగదాంబ మెస్​ యజమాని సుదర్శన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ నెల మొదటి వారంలో ఐసోలేషన్ వార్డులో ఉన్న కరోనా బాధితులకు భోజనం, అల్పాహారం అందిస్తే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బిల్లులు చెక్కు ద్వారా అందిస్తామని ఎమ్మార్వో చెప్పారని తెలిపారు. నాలుగు నెలలపాటు చెక్కులు అందించిన అధికారులు ఆగష్టు, సెప్టెంబర్​ నెలల్లో బిల్లులు చెల్లించకుండా కొవిడ్ కేంద్రాలను తొలగించారని సుదర్శన్ అన్నారు.

బిల్లుల కోసమని తాహసీల్దార్ కార్యాలయానికి వెళ్లగా... మీకు ఫుడ్ లైసెన్స్ ఉంటేనే చెక్కులు ఇస్తామని ఎమ్మార్వో అన్నారని తెలిపారు. ఎమ్మార్వో చుట్టూ తిరిగి విసుగు చెందిన బాధితుడు కలెక్టర్ కార్యాలయం ముందు నిరాహరదీక్షకు దిగాడు. ప్రస్తుతం తాను అప్పుల్లో కూరుకు పోయాయని తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్​ను వేడుకుంటున్నారు. రెండు నెలల భోజన ఖర్చుల బిల్లులు రూ.7లక్షల 86వేల రూపాయలు చెల్లించాలని బాధితుడు కోరుతున్నారు.

ఇదీ చూడండి: ఫిబ్రవరిలో మిలియన్ మార్చ్ : కోదండరాం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.