తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు కుమురం భీం ఆసిఫాబాద్ ఆర్టీసీ కార్మికులు గత 55 రోజుల నుంచి చేసిన సమ్మె ఎట్టకేలకు ముగిసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్టీసీ కార్మికులు ఈ రోజు ఉదయం ఐదున్నర గంటల నుంచే విధుల్లో చేరుతున్నారు.
ముఖ్యమంత్రి మంచి మనసుతో తమ కుటుంబాలను ఆదుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఎలాంటి షరతులు విధించకుండా విధుల్లోకి తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్మికులు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొని విధులకు హాజరయ్యారు.
ఇవీ చూడండి: రాష్ట్ర వ్యాప్తంగా విధుల్లో చేరుతున్న ఆర్టీసీ కార్మికులు