కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ విద్యార్థులు... పుల్వామా ఉగ్రదాడిలో అసువులు బాసిన జవాన్లకు నివాళి అర్పించారు. పట్టణంలోని ప్రభుత్వ కళాశాల విద్యార్థులు జాతీయ జెండా పట్టుకుని ర్యాలీ నిర్వహించారు.
పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు అమరులై నేటికి ఏడాది పూర్తికావడం వల్ల వారిని స్మరించుకున్నారు. వారి త్యాగాలు మరువలేమని కీర్తించారు.