కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏకైక మున్సిపాలిటి అయినా కాగజ్నగర్ పురపాలక సంఘానికి రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 30వ వార్డులున్న పురపాలక సంఘానికి నిన్న రిజర్వేషన్లను ఖరారుచేశారు. ఇవాళ జిల్లా కేంద్రంలో పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు వార్డుల వారీగా రిజర్వేషన్లను ప్రకటించారు.
కాగజ్నగర్ పురపాలికకు ఎస్టీ జనరల్ -1, ఎస్సీ జనరల్ -3, ఎస్సీ మహిళా -2, బీసీ జనరల్-5, బీసీ మహిళ- 4, జనరల్- 6, జనరల్ మహిళ- 9 గా రిజర్వేషన్లను ప్రకటించారు. ఛైర్మన్ పదవి జనరల్ అభ్యర్థులకు కేటాయించారు. దీంతో ఛైర్మన్ పదవికి పోటీ తీవ్రస్థాయిలో ఉండనుంది.