ETV Bharat / state

రసీదు ఇవ్వకుండా ఆదాయపు పన్ను కట్టించుకున్న కారొబార్! - kumurambheem asifabad news

కుమురంభీం ఆసిపాబాద్​ జిల్లా కాగజ్​నగర్​ మండలం కోయవాగు పంచాయతీలో ఇంటి సర్వేల పేరుతో పన్నులు కట్టించుకుంటూ రసీదులు అడిగితే తర్వాత ఇస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ఈ విషయం పంచాయతీ సెక్రటరీ దాకా తీసుకువెళ్లగా.. స్థానికుల దగ్గర తీసుకున్న డబ్బును కారొబార్​ తిరిగిచ్చేశారు.

income tax payment fraud in kagaz nagar  by karobar
రసీదు ఇవ్వకుండా ఆదాయపు పన్ను కట్టించుకున్న కారొబార్!
author img

By

Published : Oct 17, 2020, 6:22 PM IST

రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ధరణి సర్వేలో భాగంగా ప్రతి ఇంటి వద్ద పంచాయతీ సిబ్బంది ఆస్తుల వివరాలను నమోదు చేసుకుంటున్నారు. ఇదే అదనుగా భావించి.. కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​ మండలం కోయవాగు పంచాయతీలో స్థానికులతో బకాయిపడ్డ ఇంటి పన్ను కట్టించుకున్నారు. అయితే రసీదులు మాత్రం ఇవ్వట్లేదు. ఈ విషయమై స్థానికులు ప్రశ్నిస్తే.. ఆన్​లైన్​లో నమోదు చేశాక రసీదులు వస్తాయని చెప్పారని స్థానికులు తెలిపారు.

ఇదే విషయమై పంచాయతీ సెక్రటరీను సంప్రదించగా.. రసీదులు ఇవ్వకుండా పన్నులు వసూలు చేయవద్దని తాను కారొబార్​కు చెప్పినట్లు తెలిపారు. కారొబార్​ ఆనంద్​రావును రసీదుల విషయం నిలదీయగా.. కార్యాలయానికి వచ్చి తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేశారు. పని భారం వల్ల రసీదులు తర్వాత ఇస్తానని చెప్పినట్లు ఆనంద్​రావు వివరించారు.

ఇదీ చదవండిః వరదల్లో కొట్టుకెళ్లిన వాహనాలు... లక్షల్లో నష్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.