రాష్ట్రవ్యాప్తంగా గత కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మారుమూల గ్రామాల్లోని వాగులపై వంతెనలు లేకపోగా కొన్ని గ్రామాలు జలదిగ్బంధంలోనే మగ్గుతున్నాయి. అలా జలదిగ్బంధంలో చిక్కుకుపోయిన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని దిందా గ్రామంలోని నిరుపేదలకు కొందరు యువకులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
జిల్లాలోని చింతలమానేపల్లి మండలంలోని దిందా వాగు ఉప్పొంగి ప్రవహించగా దిందా గ్రామానికి బయటిప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానిక యువకులు మిత్రబృందంతో కలిసి నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగు దాటుకుని వెళ్లి గ్రామంలోని పేదలకు సరుకుల అందజేసి మంచి మనసు చాటుకున్నారు.
ఇదీ చూడండి: సామాజిక మరుగుదొడ్లు వాడే వారిలో 62శాతం మందికి కరోనా