ETV Bharat / state

ఎల్​ఆర్​ఎస్​ను వ్యతిరేకిస్తూ... భాజపా నిరసన - భాజపా తాజా వార్తలు

డబుల్ బెడ్ రూమ్, ఎల్​ఆర్​ఎస్​ను వ్యతిరేకిస్తూ కుమురం భీం జిల్లాలో భాజపా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. పేదలు ప్లాట్లు కొనుగోలు చేస్తే... క్రమబద్ధీకరణ పేరుతో ప్లాట్ ధరకంటే ఎక్కువ వసూలు చేస్తున్నారని భాజపా నాయకులు విమర్శించారు.

BJP LEADERS PROTEST AT KUMURAM BHIM DISTRICT
డబల్ బెడ్ రూమ్, ఎల్​ఆర్​ఎస్​ను వ్యతిరేకిస్తూ... భాజపా నిరసన
author img

By

Published : Sep 22, 2020, 3:35 PM IST

బడుగు బలహీన వర్గాల పేదలపై ల్యాండ్​ రెగ్యులరైజేషన్​ స్కీం (ఎల్​ఆర్​ఎస్) పేరుతో భారం వేయొద్దు.. నిరుపేదలకు హామీనిచ్చిన డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలుపుతూ డిమాండ్ చేశారు.

మంగళవారం రోజున భాజపా ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు, కుమురం భీం జిల్లా భాజపా నాయకులు డబుల్ బెడ్ రూమ్, ఎల్​ఆర్​ఎస్​ను వ్యతిరేకిస్తూ... నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

కాయకష్టం చేసి కూడబెట్టి పేదలు ప్లాట్లు కొనుగోలు చేస్తే క్రమబద్ధీకరణ పేరుతో ప్లాట్ ధరకంటే ఎక్కువ వసూలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ వస్తే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పిన తెరాస నేడు ప్రజలపై అనేక భారాలు మోపుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తుంగలో తొక్కిందని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.