కుమురం భీం జిల్లా బిబ్రలో విద్యుత్ కోతలను నిరసిస్తూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. రోజుల తరబడి విద్యుత్ కోతలు విధిస్తూ.. అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు.
ఈ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకునేవారు లేరని వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.
ఇదీ చూడండి: 'నా పేరు మధ్యప్రదేశ్.. నా కొడుకు పేరు భోపాల్'