ప్రభుత్వం గర్భిణీలకు, చిన్న పిల్లలకు ఉచితంగా అందిస్తున్న పౌష్టికాహార పదార్ధాలను లబ్దిదారులకు పంపిణీ చేయకుండా బయటివారికి అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ.. స్థానికులు అంగన్వాడీ కేంద్రానికి తాళం వేశారు. ఈ ఘటన కుమురం భీం జిల్లా రెబ్బన మండలం కొమురవెళ్లి గ్రామంలో జరిగింది.
పేదలకు అందాల్సిన పాలు, గుడ్లు తదితర పోషక పదార్ధాలను అంగన్వాడీ టీచర్ అమ్ముకుంటోందన్న సమాచారం అందుకున్న కొమురవెళ్లి గ్రామ సర్పంచి తిరుమాల్ స్థానికులతో కలిసి అంగన్వాడీ కేంద్రానికి చేరుకున్నారు. స్టాక్ వివరాలను తెలపాలని టీచర్‌ను కోరగా.. సరైన సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయిందని గ్రామస్థులు తెలిపారు. ఈ విషయమై దర్యాప్తు చేసి.. సదరు టీచర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
ఇదీ చదవండి: 'క్లిక్' కొడితే .... అంతర్జాతీయ స్ఠాయిలో అవార్ఢులు