ETV Bharat / state

రాజకీయ నాయకులుగా మారిన విద్యార్థులు

అధ్యక్షా.. ఖండిస్తున్నాం.. అంటూ విద్యార్థులు రాజకీయ నాయకుల పాత్ర పోషించారు. కుమురం భీం ఆసిఫాబాద్​లోని బోరుగూడా జడ్పీఎస్​ ఉన్నత పాఠశాలలో  మాక్​ అసెంబ్లీ నిర్వహించారు.

రాజకీయ నాయకుల పాత్ర
రాజకీయ నాయకులుగా విద్యార్థులు
author img

By

Published : Nov 27, 2019, 10:08 AM IST

రాజకీయ నాయకులుగా విద్యార్థులు
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బూరుగూడా జడ్పీఎస్​ ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులతో ఉపాధ్యాయులు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. రాజ్యాంగం అమలై 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు.

ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు పోషించాల్సిన పాత్ర, సమకాలీన సమస్యలపై ప్రజా ప్రతినిధులు చట్ట సభలో చర్చించి పరిష్కరించే విధానం, అధికార ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు సభ నిర్వహణ క్రమంలో స్పీకర్ పాత్ర మొదలైన అంశాలను ప్రత్యక్షంగా అర్థమయ్యేలా విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమం భావితరాలకు అవసరమయ్యే ప్రజాప్రతినిధులను తయారుచేయడానికి ఉపయోగపడుతుందని విద్యార్థులు తెలిపారు.

ఇవీ చూడండి : ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు... అరెస్టులు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.