ETV Bharat / state

బతుకు పోరాటంలో కుటుంబానికి మహిళల చేదోడు

ఎప్పుడూ భర్త, పిల్లలు వారి అవసరాలు అని ఇంటి పట్టునే ఉండే మహిళలు.. బతుకు బండిలో భర్తలకు సాయంగా నిలుస్తున్నారు. తమకు తెలిసిన పనుల్లోనే నిష్ణాతులుగా మారి కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. అధికారుల ప్రోత్సాహంతో తాము తయారు చేసిన వస్తువులు, పదార్థాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నారు. చిరువ్యాపారంతో మొదలుపెట్టి నెలకు లక్ష రూపాయల వరకు సంపాదిస్తున్న ఆసిఫాబాద్ అతివలు.. ఆర్థిక స్వావలంబనతోనే మహిళకు గుర్తింపు ఉంటుందని చెబుతున్నారు.

Asifabad district women helps their family financially by doing food business
బతుకు పోరాటంలో కుటుంబానికి మహిళల చేదోడు
author img

By

Published : Dec 26, 2020, 5:02 PM IST

పోలియోతో కాలువంకర పోయినా పట్టుదలతో దూసుకుపోతున్న మహిళ ఒకరు.. మరోదేశం నుంచి వలస వచ్చి వ్యాపారవేత్తగా మారిన అతివ మరొకరు.. కొడుకు ప్రమాదంతో ఉన్నదంతా తుడిచి పెట్టుకుపోయినా ధైర్యంగా నిలబడి, శ్రమనే పెట్టుబడిగా పెట్టి కుటుంబానికి వెన్నుదన్నుగా నిలిచిన వనిత ఇంకొకరు. అంకుఠిత దీక్షతో స్వయం ఉపాధి పొందుతున్న మహిళలకు గ్రామీణ అభివృద్ధి అధికారుల అండ.. కొండంత ధైర్యాన్నిచ్చింది. వారికి తెలిసిన పనుల్లో నిష్ణాతులుగా మార్చి వారు తయారు చేసిన ఉత్పత్తులకు ప్రత్యేక బ్రాండ్​ తీసుకువచ్చింది.

ఇడ్లీతో మొదలుపెట్టి..

ఆసిఫాబాద్ పట్టణానికి చెందిన స్వరూప భర్త.. చిన్న కిరాణా దుకాణంలో పనిచేసేవారు. చాలీచాలని ఆదాయంతో కుటుంబాన్ని గడపడం కష్టంగా మారడం వల్ల భర్తకు సాయం చేయాలనుకుంది స్వరూప. రూ.1500 పెట్టుబడితో ఇడ్లీలు తయారు చేసి విక్రయించడం మొదలు పెట్టి క్రమంగా. అరిసెలు, గారెలు, సకినాలు, లడ్డూలు, పచ్చళ్లు, కారప్పూస వంటి మిగతా పదార్థాలను తయారు చేస్తోంది. రాష్ట్ర నలుమూలలకే గాక విదేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఐకేపీ అధికారులు రుణం అందించడం వల్ల ప్రస్తుతం నెలకు లక్షరూపాయల వ్యాపారం జరుగుతోందని స్వరూప తెలిపారు. ఖర్చులు పోను నెలకు సుమారు రూ.50వేలు మిగులుతోందని చెప్పారు.

బంగ్లా నుంచి వచ్చి బోల్​పేలాల వ్యాపారం

బంగ్లాదేశ్​ నుంచి వచ్చి కాగజ్​నగర్​లో స్థిరపడిన కృష్ణ మండల్, అంజలి మండల్​లు బతుకుదెరువు కోసం తమ చిన్నతనంలో అమ్మమ్మ చేసిపెట్టిన బోల్​పేలాల వ్యాపారం మొదలుపెట్టారు. పేలాలు తయారు చేయడానికి కావాల్సిన ఇసుకను గొందియా నుంచి తెప్పించడానికి వీరు చాలా కష్టపడ్డారు. పేలాలు తయారు చేసి ప్యాకెట్ల రూపంలో కట్టి భర్తలకు అందిస్తే.. వాళ్లు ఊరూరా తిరిగి విక్రయించేవారు. ఇలా ప్రారంభమైన పేలాల వ్యాపారం ఎన్నో అడ్డంకులను తట్టుకుని క్రమంగా విస్తరించింది. ప్రస్తుతం నెలకు దాదాపు 70 క్వింటాళ్ల ప్యాలాలు విక్రయిస్తున్నామని కృష్ణ మండల్ చెబుతున్నారు. సుమారు లక్ష రూపాయల ఆదాయం వస్తోందని తెలిపారు. ​

బేకరీతో షురూ చేసింది

చేతికొచ్చిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో గాయపడటం వల్ల అతని చికిత్సకు అప్పటివరకు దాచిన రూ.20 లక్షలు ఖర్చైపోయాయి. భర్త ఆటోమొబైల్ వ్యాపారమూ నష్టాలను మిగల్చడం వల్ల ఆసిఫాబాద్​కు చెందిన మంజుల కుటుంబానికి ఆర్థికంగా సాయం చేయాలని నిర్ణయించుకుంది. తన దగ్గరున్న బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.ఏడు లక్షలతో బేకరీ వ్యాపారం మొదలుపెట్టింది మంజుల. కర్రీపఫ్, ఎగ్​పఫ్, కూల్​కేక్స్ వంటి రకరకాల పదార్థాలు తయారు చేసి విక్రయిస్తోంది. ఐకేపీ అధికారులిచ్చిన రూ.50వేలతో నెమ్మదిగా వ్యాపారం విస్తరించిందని మంజుల తెలిపింది. ప్రస్తుతం నెలకు రూ.90వేల వ్యాపారం జరుగుతోందని, నెలకు రూ.40వేల వరకు మిగులుతోందని హర్షం వ్యక్తం చేసింది.

ఇలా ఆసిఫాబాద్​లో మహిళలు.. భర్తకు చేదోడువాడుగా ఉంటూ తమకంటూ ఓ గుర్తింపు కోసం వివిధ రకాల వ్యాపారాలు చేస్తున్నారు. అతివకు ఆర్థిక స్వావలంబన ఎంతో అవసరమని చెబుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.