శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు కోరారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆయన మెుక్కలు నాటారు. పార్టీ కోసం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఎంతో కృషి చేశారని, భారతదేశంలో హిందూత్వం కోసం ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేసుకున్నారు.
ఆర్టికల్ 370ని ఆనాడు కాంగ్రెస్ హయాంలో రద్దు చేయాలని ఎన్నోసార్లు పోరాటాలు చేశారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆ ఆర్టికల్‌ను రద్దు చేసి ఆయన కలను నెరవేర్చారని గుర్తుచేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల జిల్లాగా పేరుగాంచిందని.. ఆ పేరును అలాగే నిలబెట్టేలా ప్రతి ఒక్కరు మెుక్కలు నాటాలని ఎంపీ సూచించారు.
ఇవీ చూడండి: 'వ్యవసాయాన్ని పండుగలా చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యం'