ETV Bharat / state

సీఎం కేసీఆర్​కి రైతన్న బహుమానం

author img

By

Published : Jun 2, 2020, 1:22 PM IST

Updated : Jun 2, 2020, 1:56 PM IST

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన ముఖ్యమంత్రి కేసీఆర్​కి... కుమురం భీం జిల్లా రైతు బాలాజీ అరుదైన బహుమానం అందజేశాడు. తెలంగాణ నేలపై పండించిన తొలి తరం యాపిల్​ పండ్లను, ఓ మొక్కను సీఎంకి బహుమానంగా అందించి... రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ సందర్భంగా రైతు బాలాజీని కేసీఆర్​ అభినందించి... తెలంగాణ నేలలు విభిన్న రకాల స్వభావం కలిగినవని చెప్పేందుకు ఈ యాపిల్ పండ్ల సాగే ఉదాహరణ అని తెలిపారు.

gift
gift

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన ప్రగతిభవన్​లో సీఎం కేసీఆర్​కి... కుమురం భీం జిల్లా రైతు అరుదైన బహుమానం అందజేశాడు. తెలంగాణ నేలపై పండిన తొలితరం యాపిల్​ పండ్లను బహుమతిగా ఇచ్చి... రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశాడు. తన వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన యాపిల్​ పంట సాగులోని తొలి కోతను, ఓ యాపిల్​ మొక్కను ముఖ్యమంత్రికి అందించాడు.

సీఎం కేసీఆర్​కి రైతు అరుదైన బహుమానం

ఆసిఫాబాద్​ జిల్లా ధనోరాకు చెందిన బాలాజీ... తన రెండెకరాల్లో హెచ్​ఆర్​-99 రకం యాపిల్​ పంటను సాగు చేశాడు. పంట సాగులో ఉద్యానవన శాఖ ఎంతో సహకారాన్ని అందించిందని బాలాజీ తెలిపాడు. సీఎం కేసీఆర్​ ప్రోత్సాహంతో యాపిల్​ సాగుపై మరింత దృష్టి కేంద్రీకరించనున్నట్లు వివరించాడు ఈ యువ రైతు. ఈ సందర్భంగా రైతు బాలాజీని అభినందించిన కేసీఆర్... తెలంగాణ నేలలు విభిన్న రకాల స్వభావం కలిగినవని చెప్పేందుకు యాపిల్ పండ్ల సాగే ఉదాహరణ అని అన్నారు.

ఇదీ చూడండి : జయహో తెలంగాణ.. అమరులకు సీఎం నివాళులు

Last Updated : Jun 2, 2020, 1:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.