ETV Bharat / state

వైరా జలాశయంలో చేపపిల్లలను వదిలిన ఎమ్మెల్యే - ఖమ్మం జిల్లా వార్తలు

మత్స్యకారుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా వైరా జలాశయంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో 20 లక్షల చేప, రొయ్య పిల్లలను వదిలారు. కులవృత్తులను ప్రోత్సహించే క్రమంలో గొర్రెల పెంపకం, చేపల పెంపకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని ఎమ్మెల్యే అన్నారు.

Wyra MLA Released 20 Lakhs Fishes In Wyra Project
వైరా జలాశయంలో చేపపిల్లలను వదిలిన ఎమ్మెల్యే
author img

By

Published : Sep 26, 2020, 3:23 PM IST

వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్​ అన్నారు. ఖమ్మం జిల్లాలోని వైరా జలాశయంలో మత్స్యశాఖ తరపున 20 లక్షల చేప, రొయ్య పిల్లలను వదిలారు. కుల వృత్తులను ప్రోత్సహించే దిశగా.. ప్రభుత్వం మత్స్యకారులకు, గొల్లకుర్మలకు పలు పథకాలు రూపొందించిందని తెలిపారు.

వివిధ రంగాలకు నిధులు కేటాయిస్తూ వ్యవసాయంతో పాటు.. పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమలను కూడా ప్రోత్సాహిస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చేప పిల్లల పంపిణీ ద్వారా మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మార్క్​ఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్, పురపాలక ఛైర్మన్ జైపాల్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ గుమ్మా రోశయ్య, జెడ్పీటీసీ కనకదుర్గ, ఎంపీపీ పావని, ప్రజా ప్రతినిధులు, మత్స్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: అక్టోబర్‌ 9న నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక.. 12న కౌంటింగ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.