ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 42 మంది లబ్ధిదారులకు చెక్కులను అందించారు. ఈ పథకం పేదల పాలిట వరంలాంటిదని ఆయన వెల్లడించారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మాలోతు శకుంతల, జడ్పీటీసీ జగన్, రైతు సమన్వయ సమితి సభ్యులు సత్యనారాయణ, రమేశ్ వివిధ పంచాయతీల సర్పంచులు ఎంపీటీసీలు కార్యక్రమంలో పాల్గొన్నారు.