ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు పెద్దన్నగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూర్ పరిధిలోని 64 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రాములు నాయక్ సూచించారు. పేదల కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలు భారం కాకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశ పెట్టారని తెలిపారు. ఒకప్పుడు రూ. 50 వేలుగా ఉన్న మొత్తాన్ని రెట్టింపు చేసి పేదల ఇళ్లలో వెలుగులు నింపారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏన్కూర్ ఎంపీపీ వరలక్ష్మి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ లాలూ నాయక్, సర్పంచ్ రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'తలసాని శ్రీనివాస్‌ను మంత్రి పదవి నుంచి తొలగించాలి'