ఖమ్మం జిల్లా సింగరేణి ఆధ్వర్యంలో ఉసిరికాయలపల్లిలో నిర్మించిన సోలార్ ప్లాంట్ స్వాగత ద్వారానికి ఇల్లందు పేరు పెట్టడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సోలార్ విద్యుత్ ప్లాంట్ ముఖ ద్వారపు ఫ్లెక్సీని ఉసిరికాయలపల్లి గ్రామస్థులు ధ్వంసం చేశారు.
![usirikayalapally villagers protest about solar plant name in yellandu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-kmm-02-26-objectionfornameboard-ab-ts10145_26122020102215_2612f_1608958335_403.jpg)
సింగరేణి మండలం పరిధిలో ఉన్నందున ఉసిరికాయపల్లి లేదా సింగరేణి మండలం పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. భూములు కోల్పోయిన తమకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. మంజూరైన నిధులు ఇల్లందు ప్రాంతానికి కేటాయిస్తున్నారని రోడ్డుపై బైఠాయించారు.
ఇదీ చదవండి: వైరాలో విషాదం: భాజపా రాష్ట్ర నేత దారుణ హత్య