ఒకే రాత్రి రెండు ఇళ్లలో చోరీ ఖమ్మంలో దొంగలు కలకలం సృష్టించారు. విజయనగర కాలనీలోని . ఒకేరాత్రి రెండు ఇళ్లల్లో దొంగతానాలకు పాల్పడ్డారు. ఒక ఇంట్లో తాళం పగుల గొట్టి చోరికి పాల్పడగా.. మరో ఇంట్లో నిద్రిస్తున్న సమయంలోనే చోరీ చేశారు. ఈ ఘటనలో మొత్తం రూ.20 వేల నగదు, వెండి పట్టీలు అపహరణకు గురైనట్లు బాధితులు తెలిపారు. ఖమ్మం రెండో పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి : ప్రగతినగర్‌లో చిరుత కలకలం