ETV Bharat / state

బావిలోకి దూసుకెళ్లిన కారు.. తప్పిన ప్రమాదం - updated news on The car that crashed into the well .. missed accident

ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయిన ఓ కారు.. అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

The car that crashed into the well .. missed accident
బావిలోకి దూసుకెళ్లిన కారు.. తప్పిన ప్రమాదం
author img

By

Published : Feb 3, 2020, 1:45 PM IST

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లి వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ఘటనలో కారులో ప్రయాణిస్తున్న గోపాల్​రావు సురక్షితంగా బయటపడ్డారు.

సత్తుపల్లి న్యాయస్థానంలో ద్వితీయ శ్రేణి న్యాయమూర్తిగా పనిచేస్తున్న గోపాల్​రావు తల్లాడ వైపు నుంచి సత్తుపల్లి వెళుతున్నారు. మిట్టపల్లి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి.. కారు బావిలోకి దూసుకెళ్లింది. వెంటనే గోపాల్​రావు అద్దాలు పగులగొట్టుకుని బయటికి వచ్చారు.

ప్రమాద సంఘటనను చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గ్రామస్థుల సహాయంతో పోలీసులు కారును బయటకు తీశారు.

బావిలోకి దూసుకెళ్లిన కారు.. తప్పిన ప్రమాదం

ఇవీ చూడండి: భారీగా ఐఏఎస్​ల బదిలీలు... కొత్త పోస్టింగ్​లు ఇవే..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.