Telangana TDP Leaders Protest on Chandrababu Arrest : రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు కదంతొక్కాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు(Chandrababu Arrest)ను నిరసిస్తూ.. నిర్మల్ జిల్లా భైంసాలో టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి బస్ స్టాండ్ సమీపంలో.. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరీంనగర్ జిల్లా రామడుగులో.. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. టీడీపీ నేతలు నల్ల బ్యాడ్లీలతో ఆందోళన చేపట్టారు. ఏపీలో రాజ్యాంగాన్ని అమలు చేయాలని అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నందమూరి జయకృష్ణ కుమారుడు.. చైతన్యకృష్ణ తీవ్రంగా ఖండించారు. చంద్రబాబును కాపాడుకునేందుకు ప్రభుత్వంపై పోరాటం చేయాలని తెదేపా కుటుంబ సభ్యులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు చైతన్య కృష్ణ వీడియోను విడుదల చేశారు.
"తెలుగు దేశం పార్టీ కార్యకర్తలారా మీరు అధైర్య పడకండి. మేము మీ వెంట ఉన్నాం. ఏపీ అవినీతి ప్రభుత్వానికి చరమగీతం పాడుదాం. చంద్రబాబును కాపాడుకుందాం. లక్షకోట్లు దోచుకున్నవాడు తిరుగుతున్నాడు. రూపాయి కూడా సంపాదించలేనివాడు జైలు పాలయ్యాడు." - నందమూరి చైతన్య కృష్ణ, జయకృష్ణ కుమారుడు
TDP Leaders Protest in Warangal District : చంద్రబాబు అరెస్టును.. హనుమకొండలో కమ్మవారి సేవా సంఘాల సమాఖ్య తీవ్రంగా ఖండించింది. అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే విడుదల చేయాలని సంఘాల నేతలు డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసన(Protest Against Chandrababu Arrest)గా.. ఖమ్మం జిల్లా కొణిజర్లలో టీడీపీ శ్రేణులు నిరసనలు చేపట్టాయి. అక్రమ అరెస్టులు నిరసిస్తూ.. ఖమ్మం- వైరా రహదారిపై ఆందోళన చేశారు.
"ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి వచ్చే ఎన్నికల్లో ఓడిపోతాననే భయం పట్టుకుంది. ఏపీలో టీడీపీకి వస్తున్న ఆదరణ తట్టుకోలేక.. ఎప్పుడో ముగిసిపోయినా ఈ కేసును మళ్లీ ప్రారంభించారు. ఆ కేసులో కావాలనే చంద్రబాబును ఇరిక్కించి.. జైలుకి పంపించారు. సీఎం జగన్ తాను జైలుకి వెళ్లారని.. చంద్రబాబును పెట్టాలనే దుష్టానందంతోనే తప్పా మరో ఉద్ధేశ్యం లేదు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏపీలో భారత రాజ్యాంగాన్ని అమలు చేయలేదు. పౌర హక్కులను పట్టించుకోలేదు. ఈ విషయాలన్ని ప్రజలు గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా సరైన బుద్ధి చెబుతారు." - జంగం అంజయ్య, చొప్పదండి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్
TDP Leaders Protest in AP : ఆదివారం కూడా నారా చంద్రబాబును అరెస్టు చేసినందుకు తెలంగాణ టీడీపీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలిపారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం దగ్గర టీడీపీ కార్యకర్తలు నిరసన తెలిపి.. సీఎం జగన్‌కి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. పలు ప్రాంతాల్లో రోడ్లుపై కూర్చోని ధర్నా చేశారు. ఇదే మాదిరి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. సోమవారం బంద్‌కి పిలుపునిచ్చి.. విజయవంతం చేశారు.
TDP Leaders Protest in Telangana : ఏపీలో చంద్రబాబు అరెస్ట్.. తెలంగాణలో భగ్గుమన్న తెలుగు తమ్ముళ్లు