ఖమ్మం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చౌక్‌లో ఏర్పాటు చేసిన శిబిరంలో ఉపాధ్యాయులు ఆందోళన నిర్వహించారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఉపాధ్యాయులకు పీఆర్‌సీ అమలు, ఐర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలను తొలగించాలనే ప్రభుత్వ ఆలోచనను విరమించుకోవాలని, వీలైతే కార్పొరేట్ పాఠశాలలను రద్దు చేయాలని కోరారు. గతేడాది ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ ఇచ్చి, ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: సచివాలయ తరలింపు: భవనాల కోసం అన్వేషణ