ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం బురద రాఘవాపురంలో శ్రీసుబ్రమణ్యస్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ తృతియ వార్షికోత్సవంలో భాగంగా స్వామి వారి ఉత్సవమూర్తులను మండపంలో కొలువుతీర్చి కల్యాణం నిర్వహించారు.
వేదపండితుల మంత్రోచ్ఛారణలతో స్వామివారికి కంకణధారణ, కన్యదానం, మంగళధారణ క్రతువులు నిర్వహించారు. ఆలయ నిర్మాణ దాతల దంపతులు పూజల్లో పాల్గొన్నారు. వివిధ మండలాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి కల్యాణాన్ని తిలకించారు. భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.
ఇదీ చదవండి: దిల్లీ తీర్పు: ప్రచారంలో భాజపా జోరు.. ఫలితాల్లో బేజారు