ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. మూడు రోజుల్లో ఆస్పత్రిలో విధులు నిర్వర్తించే నలుగురు వైద్యులు, నలుగురు వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఆందోళన చెందుతున్న కొంత మంది తమకు సెలవు కావాలంటూ ఆర్జీ పెట్టుకున్నారు. కరోనా సోకినవారిలో ఎక్కువ మంది గైనకాలజీ విభాగానికి చెందిన వారే ఉన్నందున... ఆ విభాగంపై తీవ్ర ప్రభావమే పడింది.ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, రోగులకు వైద్య సేవలు అందించేందుకు చేస్తున్న ప్రణాళికలపై జిల్లా ఆస్పత్రి ఆర్ఎంవో బి.శ్రీనివాస రావుతో మా ప్రతినిధి లింగయ్య ముఖాముఖి.
ఇదీ చదవండి: భారత్లో రెండో వ్యాక్సిన్- ప్రయోగానికి అనుమతి