ETV Bharat / state

మానవ జాతి మనుగడకు చెట్లే ఆధారం: వనజీవి రామయ్య

author img

By

Published : Jun 25, 2020, 8:41 PM IST

వర్షాలు కురవాలంటే మెుక్కలను నాటి వనాలను పెంచాలని ప్రజలకు పద్మశ్రీ వనజీవి రామయ్య సూచించారు. ఖమ్మం జిల్లాలోని పలు గ్రామాల్లో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి వనజీవి రామయ్య ప్రారంభించారు.ప్రతి ఒక్కరు మెుక్కలు నాటి వాటిని రక్షించాలని వనజీవి రామయ్య కోరారు. నాటిన ప్రతి మెుక్కను సంరక్షిస్తేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని ఎమ్మెల్యే అన్నారు.

sathupalli-mla-sandra-venkataveeraiah-started-harithaharam-programme-in-khammam-district
మానవ జాతి మనుగడకు చెట్లే ఆధారం: వనజీవి రామయ్య

మానవజాతి మనుగడకు చెట్లే ఆధారమని ప్రతి ఒక్కరూ గ్రహించాలని పద్మశ్రీ వనజీవ రామయ్య అన్నారు. వర్షాలు కురవాలంటే వనాలను పెంచాలని ఆయన ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరు మెుక్కలు నాటి వాతావరణాన్ని రక్షించాలని కోరారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవిమల్లెల, కల్లూరు మండలం పడమటి లోకారంలో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని వనజీవి రామయ్య, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి ప్రారంభించారు. భవిష్యత్​ తరాలకు ఆరోగ్యవంతమైన పర్యావరణాన్ని అందించాలని సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య అన్నారు. అడవులు నరకడం వల్ల అడవుల్లో ఉండాల్సిన కోతులు గ్రామాల్లో పడి రైతులు పండించిన పంటను నాశనం చేస్తున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. అందుకే అడవులలో మంకీ ఫుడ్ కోర్టు ద్వారా కోతులను అదుపులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. హరితహారం కార్యక్రమంలో 250 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రస్తుతం 30 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యంతో ఆరో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభమైందని తెలిపారు.

మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని ఎమ్మెల్యే అన్నారు. నూటికి నూరు శాతం మొక్కలు మనుగడ సాధించేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు బాధ్యత తీసుకొని ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం అడవిమల్లెల సర్పంచ్ మందడపు అశోక్ కుమార్ దంపతులు వనజీవి రామయ్య దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ మధుసూదన్, ఆర్​డీవో సూర్యనారాయణ, సబ్ డీఎఫ్వో సతీశ్‌ , ఎఫ్​ఆర్​వో వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ సభ్యులు మోహన్ రావు, ఏఎంసీ ఛైర్మన్ లక్ష్మణరావు, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీవో మహాలక్ష్మి, వైస్ ఎంపీపీ కస్తూరి, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: ప్రతిఇంటికీ ఆరు మొక్కలు... వాటికి కుటుంబ సభ్యుల పేర్లు: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.