ఖమ్మం నగరంలోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పట్టణ నిరుపేదల సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని పెవిలియన్ మైదానం నుంచి ధర్నా చౌక్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం ధర్నా చౌక్‌లో ధర్నా చేశారు.
కరెంట్, మంచినీరు, రెండు పడకల గదులు తదితర మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. పేదలు సాగుచేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇచ్చి, ఏజెన్సీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు.
ఇవీ చూడండి : పెళ్లి కార్డు రూ. 8లక్షలు... పెళ్లి ఖర్చు 200కోట్లు!