ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలంలోని మార్కెట్ యార్డ్లో కందుల కొనుగోలు కేంద్రాన్ని రైతు సమన్వయ సమితి కన్వీనర్ నల్లమల వెంకటేశ్వర్లు ప్రారంభించారు. నేలకొండపల్లి, కూసుమంచి, ముదిగొండ మండలాల రైతులంతా కొనుగోలు కేంద్రంలోనే కందులు విక్రయించాలని సూచించారు.
ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్, రైతు బీమా, రైతుబంధు వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని కొనియాడారు. తెలంగాణ సర్కార్ పంట కొనుగోలు చేసిన వారం రోజుల్లోనే రైతు అకౌంట్లో నగదు జమ చేస్తోందని తెలిపారు.
రైతులంతా తేమ 12 శాతం వరకు ఉండేలా చూసుకొని మార్కెట్కు కందులు తీసుకురావాలని మార్కెట్ ఫెడ్ డీఎం సుధాకర్ అన్నారు. కొనుగోలు కేంద్రానికి వచ్చేటప్పుడు ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంటు, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్సులు తీసుకురావాలని సూచించారు.
- ఇదీ చూడండి : సహకార ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ పూర్తి..