కార్పొరేట్ల ప్రయోజనాల కోసం ప్రధాని మోదీ తీసుకువచ్చిన రైతు చట్టాలు వెనక్కి తీసుకునేంత వరకు తమ పోరాటం ఆగదని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క సతీమణి, అమ్మ ఫౌండేషన్ ఛైర్పర్సన్ మల్లు నందిని స్పష్టం చేశారు. నిన్నటిదాకా రైతు చట్టాలతో నష్టం వాటిల్లుతుందని చెప్పి.. కేంద్రం హెచ్చరికతో ఇప్పుడు మాట మార్చి రైతులను మోసగించారని ఆరోపించారు.
దిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా ఖమ్మం జిల్లా మధిర తహసీల్దార్ కార్యాలయం ఎదుట అఖిలపక్ష నేతలు సంఘీభావ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో పాల్గొన్న నందిని.. భోగి మంటల్లో రైతులు చట్టాల ప్రతులను తగులబెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు రవిబాబు, నరసింహారావు, మురళి, ప్రభాకర్, మధు పాల్గొన్నారు.