ETV Bharat / state

సర్కారీ బడులు... సమస్యల నిలయాలు

శిథిల భవనాలు, కూలిన గోడలు... ఇవీ కొత్త విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు స్వాగతం పలికే నేస్తాలు. ఎన్నో ఆశలతో, కొంగొత్త ఉత్సాహంతో చదువుకుందామని బడులకు వచ్చే పిల్లలు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే దుస్థితి ఏర్పడింది. సెలవుల అనంతరం పున:ప్రారంభానికి సిద్ధమవుతున్నా... అధ్వాన్న స్థితిలో ఉన్న ఖమ్మం జిల్లాలోని సర్కారు పాఠశాలలపై ప్రత్యేక కథనం...

సర్కారు బడుల్లో సమస్యల నెలవు
author img

By

Published : Jun 11, 2019, 8:03 PM IST

సమస్యలకు నిలయంగా మారిన సర్కారు బడులు

పాఠశాలలు పున:ప్రారంభమవుతున్నా సర్కారు బడుల్లో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. ఖమ్మం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ఏ విద్యాలయాన్ని చూసినా శిథిల భవనాలు, కూలిన గోడలు, పనిచేయని చేతిపంపులు దర్శనమిస్తున్నాయి. పిల్లలను ఆకర్షించేలా ఉండాల్సిన సర్కారీ బడులు అధ్వాన్నంగా తయారయ్యాయి. ఏటా వసతులు మెరుగుపడతాయని ఆశిస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులకు ఈసారి కూడా నిరాశే మిగిలింది. ప్రభుత్వ పాఠశాలలు ఇలాంటి దుస్థితిలో ఉన్నా... అటు అధికారులు గానీ... ఇటు సర్కారు పెద్దలు గానీ పట్టించుకున్న దాఖలాలు లేవు.

ఉపాధ్యాయుల కొరత

ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గంలో 199 ప్రాథమిక, 54 ప్రాథమికోన్నత, 34 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో సుమారు 26,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. కొణిజర్ల, కారేపల్లి మండలాల్లో ఎక్కువ మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నప్పటికీ వారికి సరిపడా సౌకర్యాలు లేవు. ఉన్నత పాఠశాలల్లో రెగ్యులర్‌ ఉపాధ్యాయులు, పీఈటీలు లేక ఏళ్లుగా పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. అవసరానికి సరిపడా తరగతి గదులు లేవు. మరుగుదొడ్లు, వంటగదులు మంజూరైనా వాటి నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు.

సమస్యల నిలయాలు

చాలా పాఠశాలల్లో తాగునీటి వసతి లేక విద్యార్థులు ఇళ్ల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. మధ్యాహ్న భోజనం తయారు చేసేందుకు వంటగదులు లేక కొన్ని చోట్ల వరండాలోనే వండుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలను తీర్చి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.

ఇదీ చూడండి : 'కలెక్టరేట్ ముందు ఎమ్మెల్యే సీతక్క ధర్నా'

Intro:TG_KMM_07_11_SAMASYALA BADULU_PKG_g9

Body:wyra

Conclusion:8008573680
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.