ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో అకాల వర్షం కురిసింది. కల్లాల్లో ధాన్యం ఆరబోసిన సమయంలో ఒక్కసారిగా వర్షం పడటం వల్ల వాటిని కాపాడుకోవడానికి రైతులు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది.
ఏన్కూరు వ్యవసాయ మార్కెట్‌లో ఆరబోసిన ధాన్యం, ఎగుమతికి ఉన్న బస్తాలు తడిసిపోయాయి. ఇప్పటికే తేమశాతం పేరుతో రోజుల తరబడి ఉంటున్న కర్షకులకు అకాల వర్షం మరింత ఇబ్బందులు తెచ్చింది. పొలాల్లో తీయకుండా ఉన్న ప్రత్తి సైతం తడిసి ముద్దైంది.
ఇదీ చూడండి : నడిరోడ్డుపై పోకిరిని చితక్కొట్టిన మహిళలు